జూబ్లీహిల్స్ విజయం ప్రజా తీర్పు
చేగుంట, నవంబర్ 14 :తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే జూబ్లీహిల్స్ విజయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు తో కలిసి టపాకాయలు కాల్చి మిఠాయిలు ఒకరికొకరు తిని పించుకున్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో బిఆర్‌ఎస్ పార్టీ, బిజెపి పై వ్యతిరేకత బట్టబయలు అయిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్, అయిత పరంజ్యోతి, సండ్రుగు శ్రీకాంత్, సాయికుమార్ గౌడ్, మహేష్, ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్,మోహన్ నా యక్, నదీమ్, రాజు,ఫకీర్ నాయక్, బోలా శ్రీకాంత్, మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ సినియర్ నాయకులు పాల్గొన్నారు.




