14-11-2025 11:29:04 PM
సుల్తానాబాద్ లో ఘనంగా బిజెపి సంబరాలు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్బంగా శుక్రవారం బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కూకట్ల నాగరాజు ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి హాజరై మాట్లాడుతు దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గెలిచేది నరేంద్రమోది ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వమేనని, మన రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలో విజయంసాధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం కాయమని అన్నారు.