calender_icon.png 14 November, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పనితీరుకు జూబ్లీహిల్స్ గెలుపు నిదర్శనం

14-11-2025 05:34:41 PM

దేవరకద్రలో టపాకాయలు కాల్చి సంబరాలు 

గెలుపు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది : ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందించిన సేవలను గుర్తించి జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు తెలపడం జరిగిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకద్ర లో ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరిన్ని గ్రౌండ్లో మిగిలి ఉండగానే గెలుపు దిశగా ఆదిత్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ముందంజలో ఉండడం గెలుపుకు నిదర్శనం అన్నారు. దాదాపుగా 30 వేల పైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని పేర్కొన్నారు. కేటీఆర్ హరీష్ రావులు మాయమాటలు చెప్పి ప్రజలను మమ్మి పెట్టి ఎలాగైనా గెలవాలని చూశారని ప్రజలు ఈ విషయాలను పూర్తిస్థాయిలో పరిగెను తీసుకొని ముందుకు సాగారు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంచలంచలుగా ఎన్నికలు ఎక్కడ పెట్టిన గెలుపు ఖాయం దిశగా అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకొని తమ సంబరాలను చేసుకుంటూ సంతోషాన్ని వెలిబుచ్చారు.