17 June, 2026 | 8:46 PM

Breaking News

కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి   •   బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •  

జూబ్లీనగర్ కవల ఆడపిల్లల హత్య కేసు ఛేదన.. కన్నతండ్రితో సహా నలుగురు నిందితుల అరెస్ట్

07-04-2026 12:05 AM

కరీంనగర్,ఏప్రిల్6(విజయక్రాంతి): సొం త బిడ్డలనే కాలయముడిలా మారి బావిలో ముంచి చంపిన దారుణ ఘటనలో కన్నతండ్రితో పాటు అతనికి సహకరించిన కుటుంబ సభ్యులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తిపై మక్కువతో, ఆడపిల్లలనే వివక్షతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది.కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ నివాసి కచ్చు శ్రీశైలం (28), ప్రతిమ మెడికల్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.

2020లో మౌనికతో ఇతనికి వివాహం కాగా, 2022 లో వీరికి కవల ఆడపిల్లలు (గీతంశి, గీతన్విక) జన్మించారు. అయితే మొదటి నుండి మగపిల్లవాడు కావాలని కోరుకున్న శ్రీశైలం కు, ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదు. సుమా రు 2 కోట్ల విలువైన ఆస్తి ఆడపిల్లల పెళ్లిళ్లకే సరిపోతుందని భావించిన శ్రీశైలం, తన తల్లిదండ్రులు అశోక్, లావణ్య, తమ్ముడు రాకే ష్తో కలిసి పిల్లలను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు.

ప్రిల్ 3న, పథకం ప్ర కారం నిందితుడు శ్రీశైలం తన భార్యను ఇం ట్లోనే ఉండమని చెప్పి, బలవంతంగా ఇద్దరు కుమార్తెలను మోటార్ సైక్పి పొలం వద్దకు తీసుకెళ్లాడు. చుట్టుపక్కల ఎవరూ లేని సమ యం చూసి, నలుగురు నిందితులు ముం దుగా అనుకున్న ఒప్పందం ప్రకారం, శ్రీశై లం ఇద్దరు చిన్నారులను వ్యవసాయ బావిలోకి తోసివేశాడు. నీటిలో మునిగిపోతున్న గీతంశి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుండగా, తనే బావిలోకి దిగి ఆమెను నీటిలో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, పిల్లలను కాపాడబోతున్నట్లు గా నటిస్తూ కేకలు వేశాడు.

నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీ సులకు సమాచారం అందించారు. రూరల్ సి.ఐ. నిరంజన్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులు గోపాల్పూర్లో తలదాచుకున్నట్లు గుర్తించారు. ఏప్రి ల్ 5 మధ్యాహ్నం నిందితులను అదుపులోకి తీసుకోగా, వారు తమ నేరాన్ని అంగీకరించారు.అరెస్టైన వారిలో కచ్చు శ్రీశైలం (తండ్రి),కచ్చు అశోక్ (తాత),కచ్చు లావణ్య (నానమ్మ),కచ్చు రాకేష్ (బాబాయ్)లు ఉన్నారు.

హత్యకు ఉపయోగించిన గ్లామర్ మోటార్ సైకిల్, ఒక వివో మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ కుమార్, సి.ఐ. నిరంజన్ రెడ్డి సిబ్బందిని కరీంనగర్ సి.పి. గౌష్ ఆలం అభినందించారు. గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించడం జరిగింది.