7 April, 2026 | 1:58 AM

భారతీయ జనతా పార్టీ స్థాపన దివస్

07-04-2026 12:06 AM

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): జిల్లా పార్టీ కార్యాలయం పైన ఘనంగా పార్టీ జెండాను ఆవిష్కరించి బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఈ సందర్భంగా ఆయన పార్టీ స్థాపకులకు, మహానేతలకు ఘన నివాళులు అర్పిస్తూ, పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ మరింత బలపడాలని ఆకాంక్షించారు.

భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న స్థాపించబడినప్పటి నుండి సాధారణ కార్యకర్తల శక్తితో ఎదుగుతూ, దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా అవతరించింది. ప్రారంభ దశలో కేవలం రెండు ఎంపీ స్థానాలతో మాత్రమే ప్రస్థానం ప్రారంభించిన పార్టీ, క్రమంగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ తన బలం పెంచుకుంది.ఆ తర్వాతి దశల్లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీ తన సత్తాను చాటింది.

అనంతరం నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అఖండ విజయాలను సాధిస్తూ, పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ అభివృద్ధికి కొత్త దిశను చూపుతోంది.ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర పదాధికారులు వివిధ మండలాల అధ్యక్షులు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, ఉత్సాహభరితంగా స్థాపన దివస్ వేడుకలను నిర్వహించారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల సేవలో ముందుండాలని సంకల్పం వ్యక్తం చేశారు.