10 July, 2026 | 10:18 AM

కవిత బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు

01-07-2024 12:05 AM

బెయిల్ ఇవ్వొద్దన్న దర్యాప్తు సంస్థలు

మార్చి 15 నుంచి జైలులోనే కవిత

న్యూఢిల్లీ జూన్ 30: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ కాంత శర్మ బెంచ్ మే 28న తీర్పును రిజర్వ్ చేసింది. కల్వకుంట్ల కవిత తరఫున సీనియర్ అడ్వొకేట్ విక్రమ్ చౌదరి, అడ్వొకేట్ నితీష్ రానా వాదనలు వినిపించారు.  ఇక సీబీఐ తరఫున అడ్వొకేట్ డీపీ సింగ్, ఈడీ తరఫున అడ్వొకేట్ హొస్సేన్ హాజరయ్యారు. 

బెయిల్ ఇవ్వొద్దు.. 

కవితకు బెయిల్ మంజూరు చేయొద్దని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ వాదిస్తోంది. దర్యాప్తు కీలకమైన దశలో ఉందని, ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అక్రమంగా సంపాదించిన డబ్బుకు సంబంధించిన విచారణలు కీలకమైన దశలో ఉన్నాయని సీబీఐ అధికారులు తెలిపారు. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ మాత్రమే కాకుండా ఈడీ కూడా వాదించింది. మరి ఢిల్లీ హైకోర్టు కవితకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తుందో లేదో మరికొన్ని గంటల్లో తెలియనుంది. ఇప్పటికే ఈ కేసులో ఆమె 100 రోజులకు పైగా జైల్లో ఉన్నారు.