చీతాలకు ఆయింట్‌మెంట్
01-07-2024 12:05 AM
షోపూర్, జూన్ 30: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో చీతాల మరణ మృదంగంపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో బతికి ఉన్నవాటినైనా కాపాడుకొనేందు కు అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చీతాలను చంపుతున్న సెప్టిసేమియా అనే ప్రమాదకర బ్యాక్టీరియా నుంచి రక్షించేందుకు వాటికి విదేశాల నుం చి తెప్పించిన ‘యాంటీ ఎక్టో పారాసైట్ మెడిసిన్’ అనే ఆయింట్‌మెంట్‌ను పూయాలని పార్కు అధికారులు నిర్ణయించారు. ఈ ఆయింట్‌మెంట్‌ను దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకొన్నారు. పార్కులోని 13 చీతాలకు ఈ ఆయింట్‌మెంట్‌ను పూసినట్టు వెల్లడించారు. దీని ప్రభావం మూడు నాలుగు నెలలు ఉంటుందని కునో నేషనల్ పార్కు డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు. చీతాలకు వెంట్రులకు ఈ ఆయింట్‌మెంట్‌ను పూస్తారు.






