17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

హిందూ ధర్మాన్ని జాగృతం చేసేందుకు జూడో యాత్ర

25-02-2026 12:00 AM

కుబీర్, ఫిబ్రవరి ౨౪ (విజయక్రాంతి): భారతీయ సమాజంలో హిందూ ధర్మాన్ని జాగృతం చేసి ధర్మ పరిరక్షణ కోసమే హిందూ జూడో యాత్ర హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు కలికి ఆశ్రమ పీఠాధిపతి సరస్వతి ఆనంద్ మహారాజ్ తెలిపారు. ఈనెల 26న ముధోల్ మండల కేంద్రంలోని బసవ గార్డెన్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఋషులు, మహా రుషులు హాజరవుతారని పేర్కొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ వీరశైవ లింగాయత్ ధర్మ ప్రచారం. భారతీయ సంస్కృతి సంరక్షణ తదితరు అంశాలపై భక్తులకు దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ గౌరవ అధ్యక్షులు గంగాధర్ పటేల్ అధ్యక్షులు శంకర్ పటేల్, ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్ నాయకులు గణేష్ మారుతి రాం పటేల్ సాయినాథ్ పటేల్.పాండురంగ తదితరులు ఉన్నారు.