22 June, 2026 | 2:28 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

గ్రామస్థాయి పరిపాలనలో జీపీఓల పాత్ర కీలకం

25-02-2026 12:00 AM

నస్పూర్, ఏప్రిల్ 24 : ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ గ్రామస్థాయి పరిపాలనలో జిపిఓల పాత్ర కీలకమైనదని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో జిపిఓ, ఆర్ ఐ యాప్ పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి తహసిల్దార్ మల్లికార్జున్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్ లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వి.ఆర్.ఓ., వి.ఆర్.ఏ. లుగా సేవలు అందించిన వారు గ్రామంలో జరిగే అన్ని విషయాలను ప్రభుత్వానికి అందించి ప్రజా సంక్షేమం కోసం చర్యలు తీసుకునేందుకు గ్రామ పాలన అధికారులుగా నియమించామని, గ్రామ స్థాయిలో ధ్రువపత్రాల జారీ, లబ్ధిదారుల ఎంపిక  జి పి ఓ ల ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు.

కులం, ఆదాయం ఇతర ధ్రువపత్రాల కొరకు మీ సేవా ద్వారా అందిన దరఖాస్తులను యాప్ ద్వారా పరిశీలించి పరిష్కరించవచ్చని, తద్వారా సమయం ఆదావుతుందని, పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. విధుల విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.