10 July, 2026 | 4:00 AM

సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే

10-07-2026 02:11 AM

నిజాంసాగర్, జూలై 9(విజయ క్రాంతి): తనపై నమ్మకం ఉంచి సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా, మైనారిటీ కమ్యూనిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి కి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపినట్లు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా శాసనసభలో వచ్చే బిల్లులపై సమగ్ర చర్చలో పాల్గొని ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, స్పీకర్, రాజ్యసభ సభ్యులకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.