ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సిద్దిపేట కలెక్టరేట్, జూలై 9: ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి యన్.ఉత్తమ్ కుమా ర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 15 శాతం వర్షపాతం లోటు నమోదైందని, కృష్ణా గో దావరి బేసిన్లలో నీటి నిల్వలు తగ్గడంతో ఈ ఖరీఫ్లో సాగునీటి విడుదలకు ప్రణాళికలు లేవని, నీటి లభ్యత లేని ప్రాంతాల్లో వరి సా గుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.
రైతు వేదికలు, ప్యాక్స్ల ద్వారా నీటి లభ్యత, వర్షపాతం అంచనాలపై నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వాతావరణం, వరద పరిస్థితులను నిరంత రం పర్యవేక్షిస్తూ రైతులకు సమాచారం అం దించాలని సూచించారు. జూలై 15 తర్వాత నీటి నిల్వలను సమీక్షించి ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టమైన సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఐటీ, పరిశ్రమ ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహారాష్ట్ర, కర్ణాటకలో వరద పరిస్థితులను గమనిస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద వస్తే నీటిని ఎత్తిపోసేందుకు పంపింగ్ వ్యవస్థలను సిద్ధంగా ఉంచా లని, అప్పటివరకు తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ కె.హైమావతి. డీఏవో స్వరూపారాణి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






