19 March, 2026 | 9:25 AM

కేజీబీవీ పాఠశాలను సందర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

19-03-2026 01:26 AM

నిజాంసాగర్, మార్చి 18 (విజయక్రాంతి): నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం రోజు జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు సందర్శించారు. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ  పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య భోజనాన్ని అందించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.

 విద్యార్థినులతో ముచ్చటిస్తూ వారి విద్యాభివృద్ధి, వసతులు, భవిష్యత్ అవకాశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించలన్నారు పాఠశాలలో ఉన్న కొన్ని సమస్యలను గుర్తించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయనవెంట కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఎలె మల్లికార్జున్ తదితరులు ఉన్నారు.