19 March, 2026 | 6:42 AM

వెల్లివిరిసిన మత సామరస్యం

19-03-2026 01:24 AM

గాంధారి , మార్చి 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మేడిపల్లి గ్రామంలో మత సామరస్యం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల క్రితం కొన్ని ప్రాంతాల్లో మత ఘర్షణలు ఏర్పడిన నేపథ్యంలో మండలములోని మేడిపల్లి గ్రామ ప్రజలు హిందూ ముస్లిం బాయి బాయి అనేలా గ్రామ మసీదు కమిటీ తరపున హనుమాన్ మలదారులకు స్థానిక రామాలయంలో బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హనుమాన్ మాలధారులు , మసీదు కమిటీ వారితో కలిసి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భిక్ష చేశారు.. గ్రామ పెద్దలు మాట్లాడుతూ హనుమాన్ మాల ధారులకు మసీదు కమిటీ వారు భిక్ష ఏర్పాటు చేయడం హర్షించదగ్గదని వారిని అభినందించారు.. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, హనుమాన్ మాలధారులు, మసీదు కమిటీ వారు పాల్గొన్నారు.