క్రీడలు ప్రారంభించిన జూనియర్ సివిల్ జడ్జి
ఆమనగల్లు, ఆగస్టు 11 (విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమనగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు, కోర్టు సి బ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమనగల్లు జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ హాజరై, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకర్ యాదిలాల్, కార్యవర్గంతో కలిసి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జడ్జి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడల్లో గె లుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీ డా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. న్యా యవాదుల కోసం పలు పోటీలను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వి నియోగం చేసుకోవాలని బార్ అసోసియేష న్ అధ్యక్షులు యాదిలాల్ తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శేఖర్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గౌ డ్, సీనియర్ న్యాయవాదులు లక్ష్మణ శర్మ, జానకి రాములు, జమీల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్తీక్, కోర్టు సూపరింటెండెంట్ మురళీ కృష్ణతో పాటు పలువురు న్యాయవాదులు, కార్యవర్గ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.






