అటవీ హక్కుల లబ్ధిదారులకు అండగా ప్రభుత్వం
జిల్లా కలెక్టర్ రాజర్షి షా..
ఉట్నూర్, ఆగస్టు 11: అటవీ హక్కుల ప త్రాలు పొందిన గిరిజనులు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల సమస్యల పరిష్కా రంతో పాటు వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అం దేలా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సీఏజీ, క్రిస్ప్ సంస్థల ఆధ్వర్యంలో మంగళ వారం ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్ పీఎంఆర్సీ భవనంలో దొంగచింత, బీర్సాయిపేట్ గ్రామ పంచాయతీల పరిధిలో షె డ్యూల్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం 2006 అమలుపై నిర్వహించిన పైలట్ సా మాజిక తనిఖీ - ప్రజా వేదికలో పలువురు గి రిజన రైతులు తమ సమస్యలు,
సాగులో ఎ దురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాల అమలుపై తమ అభిప్రాయాలను ముఖ్య అ తిథిగా హాజరైన కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందులకు వివరించగా వారు మాట్లాడారు. అటవీ హక్కుల పత్రా లు పొందిన రైతులకు పంట రుణాలు, రైతు భరోసా, వ్యవసాయ రాయితీలు, ఇతర సం క్షేమ పథకాల ప్రయోజనాలు వాస్తవంగా అందుతున్నాయా లేదా అనే అంశాలను ఈ సామాజిక తనిఖీ ద్వారా సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు 2006లో తీసుకువచ్చిన అడవి హ క్కుల చట్టంపై దేశంలోనే ప్రథమంగా అదిలాబాద్ జిల్లాలో సోషల్ ఎడిట్ ( సామూహిక తనిఖీ) నిర్వహించామన్నారు.
క్షేత్రస్థా యిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పట్టాదారులు మరణించిన సందర్భాల్లో వారి వారసుల పేర్లకు అటవీ హక్కుల పత్రాలు బదిలీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. అర్హులైన వారసులు ఐటీడీఏ లేదా సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప ట్టా ఉన్నా లేకపోయినా అటవీ భూముల్లో సాగు చేస్తున్న అర్హులైన రైతులకు ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువులు, విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కోర్ ఏరియాలో ఇప్పటికే తవ్విన బోరు బావులను వినియోగంలోకి తీసుకురావడానికి సోలార్ ప్యానెల్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు కల్పించే విషయంలో అటవీ శాఖ అధికారులతో సమన్వ యం చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ గంగాధర్, ఉట్నూర్ ఆర్డీఓ మోహన్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, ఏపీవోలు వసంత్ రావు, భాస్కర్, కిసాన్ గిరిజన మిత్ర కోఆర్డినేటర్ హర్ష, అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు, క్రిస్ప్, కిసాన్ మిత్ర హెల్ప్లైన్ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






