12 August, 2026 | 2:33 AM

వరిసాగు వద్దు..ఆరుతడి పంటలు వేయండి

12-08-2026 12:04 AM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 11(విజయ క్రాంతి): ఎల్ని నో ప్రభావం నేపథ్యం లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి ఆ రుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని కొన్ని ప్రాంతా ల్లో రైతులు వరి నాట్లు వేస్తున్నట్లు తమ దృ ష్టికి వచ్చిందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ ని పుణులు హెచ్చరిస్తున్న.

నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బో రుబావులు ఉన్న రైతులు సైతం వరి సాగుకు అవసరమైన నీరు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందా అనే విషయాన్ని ముం దుగానే ఆలోచించుకోవాలని అన్నారు.ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లాలో వర్షపాతం మెరుగ్గా ఉన్నప్పటికీ, వరి సాగుకు అవసరమైన స్థాయిలో నీటి లభ్యత ఉండకపోవచ్చని పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని దృ ష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగుపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకుని రైతులు అధిక లాభాలు పొందాలని సూచించారు.

15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు అందజేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కె. హరిత తెలిపారు. మండల, గ్రామస్థాయిలో ప్రణాళికాబద్ధంగా కార్డుల పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. జి ల్లా వ్యాప్తంగా ఇప్పటికే మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ తర లింపుపై నిఘా ఏర్పాటు చేశామని, ఎక్కడైనా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తిస్తే ప్రజ లు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.