calender_icon.png 5 May, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం

14-04-2025 12:00:00 AM

పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య

నల్లగొండ, ఏప్రిల్ 13( విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. ఆదివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు. సన్న బియ్యం పథకంతో అన్ని వర్గాల పేద ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ క్రమం తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతుందని పేర్కొన్నారు. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలలో వెలుగును నింపుతుందని అన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలన్నింటినీ అమలు చేస్తూ మాట నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన సాగిస్తూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.