14-04-2025 12:00:00 AM
- బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహ రెడ్డి, నవజీవన్ రెడ్డి
- అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసిన కార్పొరేటర్లు
ఎల్బీనగర్, ఏప్రిల్ 13 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని, రాజ్యాంగం స్ఫూర్తిని ప్రజలకు వివరించాలని కార్పొరేటర్లు కొప్పుల నర్సింహ రెడ్డి, నవజీవన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలను శుద్ధి చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేశారు.
ఎల్బీనగర్ అండర్ పాస్ రోడ్ సమీపంలో ఉన్న అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకురాలు రాణీ రుద్రమదేవి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు కార్యకర్తలతో కలిసి విగ్రహాలను నీటితో కడిగి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం విగ్రహాలను శుభ్రం చేసి, సాయంత్రం దీపాలతో అలంకరిస్తున్నట్లు తెలిపారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పిఠీకను చదివి రాజ్యాంగాన్ని పాటిస్తామని ప్రమాణం చేసి, రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాయకులు బండారి భాస్కర్, మునగాల హరీష్ రెడ్డి, గుండె కిరణ్ కుమార్, నరేష్ యాదవ్, యంజాల జగన్, భీమనపల్లి సిద్దు తదితరులు పాల్గొన్నారు.
హయత్ నగర్‌లో...
అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత నాయకులు హయత్ నగర్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు. కార్యక్రమంలో బీజేపీ మల్కాజిగిరి పార్లిమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీను, ఎస్సీ జిల్లా మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేశ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు సంఘీ అశోక్, గోవింద చారి, నాయకులు వస్పరి వెంకేటేష్, సురేశ్, బాలు, నర్సింహ, ఎర్ర శ్రీకాంత్, ఎర్ర శ్రీను, భరత్ తదితరులు పాల్గొన్నారు.