14-04-2025 12:00:00 AM
* మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
* కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు
* కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సబిత
మహేశ్వరం, ఏప్రిల్ 13: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులో కాంగ్రెస్ పార్టీ ని ప్రజలు బొందపెట్టడం ఖాయమని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం పెద్దమ్మతండా చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆరు గ్యారంటీల పేరిట గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ... హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫు పడిపోతుందని... కాంగ్రెస్ పాలల్లో విసుకు చెందిన ప్రజలే ఆ పార్టీ ని బొందపెట్టడం ఖాయమని అన్నారు. 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదని ఆమె గుర్తు చేశారు.
కేసీఆర్ పార్టీలకు అతీతంగా పనిచేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌స్ పార్టీ అధికారం చేపట్టబోతుందనే దృఢ సంకల్పంతోనే ఆయా పార్టీల నేతలు అంతా బీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారన్నారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు. పార్టీలో చేరినవారి లో కాట్రవత్ రాములు నాయక్, హరిచంద్ నాయక్, లక్ష్మన్ నాయక్, శ్రీను నాయక్, లింగం నాయక్, దేవేందర్ నాయక్, శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.