25-11-2025 12:20:43 AM
న్యూఢిల్లీ, నవంబర్ 24: భారత 53వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐగా సేవలందించనున్నారు. హర్యానా నుంచి భారత అత్యున్నత న్యాయమూర్తి (సీజేఐ) పదవి అలంకరించిన మొదటి న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సరికొత్త రికార్డు నెలకొల్పారు.
సుప్రీం కోర్టు పరిధిలో పేరుకుపో యిన 90,000కి పైగా కేసులకు సత్వర పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని ఈ సం దర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. కార్యక్రమానికి ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర న్యా యశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయ ల్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆరు దేశాల ప్రధాన న్యాయమూర్తులు హాజరు
ప్రమాణ స్వీకారోత్సవానికి భూటాన్, కెన్యా ప్రధాన న్యాయమూర్తిలు ల్యోన్పో జస్టిస్ నోర్బుత్షేరింగ్,జజస్టిస్ మార్తా కూమ్, మలేషియా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ తాన్‌శ్రీ దుతుక్ నళిని పద్మనాభన్, మారిషస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీబీ రెహానా మంగ్లీ గుల్బుల్, నేపాల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాశ్ మాన్‌సింగ్ రౌత్, శ్రీలంక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పద్మన్ సురసేన హాజరవడం విశేషం.
అర్థవంతమైన విచారణకు ప్రాధాన్యం
2019లో జస్టిస్ బీఆర్ గవాయి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన రోజే జస్టిస్ సూర్యకాంత్ కూడా అదే హోదాలో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కే సుల విచారణ సంఘర్షణాభరితంగా ఉండకుండా, వ్యర్థ వాదోపవాదాలుకు తావు లేకుండా ఉండాలని, విచారణ ఎప్పుడూ సు న్నితంగా సాగాలని, అర్థవంతంగా సాగి కేసులకు పరిష్కారం లభించేలా ఉండాలనేది ఆయన ఆకాంక్ష.
14 సంవత్సరాల పాటు పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా, ఏడాదిన్నరపాటు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా సేవలందించిన సమయంలోనూ అదే తరహా విధానాలను జస్టిస్ సూర్యకాంత్ అమ లు చేసి ఎన్నో కీలకమైన తీ ర్పులు వెలువరించారు. ఇప్పుడు భారత ప్రధాన న్యాయ మూర్తిగా దేశానికి విశిష్టమైన సేవలు అందిస్తారని, న్యాయవ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తారని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
‘సీజేఐ’ పదవి విశేషాలు
హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమ ణ వయస్సు 62 ఏళ్లు కాగా, సీజేఐలకు ఆ పరిమితి 65 ఏళ్లు. సీజేఐకి ‘మాస్టర్ ఆఫ్ ద రోస్టర్’గా పేరుంది.
సుప్రీంకోర్టు పరిధిలో ఏ న్యాయమూర్తి ఏ రకమైన కేసుల విచారణ చేపట్టాలన్న విషయంలో సీజేఐదే తుది నిర్ణయం. కాగా దేశంలో అత్యున్నత అధికారిక హోదాల ప్రకారం.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు.. ఆ తర్వాతి స్థానం సీజేఐది. అయితే.. ఇప్పటివరకు ఒక్క మహిళా న్యాయమూర్తునా సీజేఐగా బాధ్యతలు చేపట్టకపోవడం లోటు.
సొంత వాహనంలో జస్టిస్ గవాయ్ నివాసానికి..
జస్టిస్ బీఆర్ గవాయ్ కొత్త సంప్రదాయానికి నాంది పలికారు. సీజేఐగా తన పదవీకాలం ఆదివారంతో ముగియగా, మర్నాటి ఉదయం ఆయన తన అధికారిక కారులో రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. నూతన సీజేఐగా జస్టిస్‌గా సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జస్టిస్ గవా య్ ఆ కారును అక్కడే వదిలి, సొంత కారులో తిరిగి నివాసానికి వెళ్లారు. తద్వారా కొత్త సీజేఐ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనకు అధికారిక కారు అందుబాటులోనే ఉండాలనే సంప్ర దాయానికి జస్టిస్ గవాయ్ శ్రీకారం చుట్టినట్లు స్పష్టమవుతున్నది.