calender_icon.png 25 November, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటన్‌ను వీడనున స్టీల్ కింగ్ లక్ష్మీ మిట్టల్!

25-11-2025 12:47:18 AM

  1. 226 ఏళ్లుగా అమలులో ఉన్న నాన్-డోమ్ పన్ను విధానం రద్దుతో నిర్ణయం
  2. కొత్త పన్ను విధానంపై పెదవి విరుపు  
  3. దుబాయ్‌కి పెట్టుబడులు మళ్లించే యోచనలో ఆదిత్య మిట్టల్

న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ బ్రిటన్‌ను వీడ్కో లు పలకనున్నట్లు తెలుస్తోంది. కీర్ స్టార్మర్ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త పన్ను విధానం కారణంగా ఆయన ఈ నిర్ణ యం తీసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామం యూకేలోని సంపన్నుల్లో చర్చనీయాంశంగా మారింది. యూకేలో 226 ఏళ్లుగా అమల్లో ఉన్న ‘నాన్-డోమ్’ (నాన్-డొమిసైల్) పన్ను విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విధానం ప్రకారం, యూకే నివాసితులు తమ విదేశీ ఆదాయంపై బ్రిటన్‌లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వెసులుబాటును తొలగించడంతో లక్ష్మీ మిట్టల్ వంటి ఎందరో సంపన్నులు యూ కేను వీడి, పన్నుల స్వర్గధామాలైన ఇతర దేశాల వైపు చూస్తున్నారు.ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ అ యిన ఆర్సెలార్ మిత్తల్‌లో మిత్తల్ కుటుంబానికి 40 శాతం వాటా ఉంది. 2021లో లక్ష్మీ మిట్టల్ సీఈఓగా దిగిపోవడంతో ఆయ న కుమారుడు ఆదిత్య మిట్టల్ ఈ బాధ్యతలను స్వీకరించారు.

ఈ కొత్త పన్ను విధా నంతో ఆయన దుబాయ్ వైపు దృష్టి సారించారు. భవిష్యత్ పెట్టుబడులన్నీ ఒక ఆ దేశం లోనే ఉండొచ్చనని మీడియా కథనం వెల్లడించింది. సండే టైమ్స్ రిచ్ లిస్ట్ (2025) ప్రకారం, మిట్టల్ సంపద 15.4 బిలియన్ పౌండ్లతో యూకేలో ఎనిమిదో అత్యంత సం పన్నుడిగా ఉన్నారు.  సంపన్నులు ఇలా దేశా న్ని వీడటం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ అక్షతా మూర్తికి ఈ పన్నుల సెగ తగిలిన సంగతి తెలిసిందే. ఇ న్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తి.. బ్రిటన్‌కు వెలుపుల సంపాదించిన సొమ్ముపై పన్నులు చెల్లించట్లేదని సునాక్‌పై ఆయన ప్రత్యర్థులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదికాస్తా తీవ్ర వివాదస్పదం కావడంతో స్పం దించిన ఆమె ఇకపై ప్రపంచ వ్యాప్తంగా ఆర్జించే ధనంపై కూడా తాను యూకేలో ప న్ను చెల్లిస్తానని అప్పట్లో ప్రకటించారు.