5 July, 2026 | 3:30 PM

ఫైనల్‌కు సురేఖ బృందం

23-05-2024 12:41 AM

ఆర్చరీ స్టేజ్ ప్రపంచకప్

యెచియోన్ (దక్షిణ కొరియా): తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ బృందం ఆర్చరీ స్టేజ్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన ఆర్చరీ కాంపౌండ్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి స్వామి త్రయం 233 స్కోరుతో అమెరికాను చిత్తు చేసి స్వర్ణంపై గురి పెట్టింది. శనివారం జరగనున్న ఫైనల్లో  జ్యోతి బృందం ప్రపంచ ఏడో ర్యాంకర్ టర్కీని ఎదుర్కోనుంది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలవడంతో జ్యోతి బృందానికి నేరుగా క్వార్టర్స్ ఆడేందుకు బై లభించింది. క్వార్టర్స్‌లో మన భారత జట్టు 236 స్కోరుతో ఇటలీని చిత్తు చేసింది. కాగా సురేఖ బృందం గత నెల షాంఘై వేదికగా జరిగిన ఆర్చరీ స్టేజ్ ప్రపంచకప్‌లో స్వర్ణ పతకం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక పురుషుల ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్, ప్రథమేష్‌లతో కూడిన భారత జట్టు నిరాశ పరిచింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో నాలుగో స్థానంలో నిలిచిన మన జట్టు బుధవారం కాంస్య పతక పోరులో ఆస్ట్రేలియా చేతిలో 133 (10 ఓటమి చవిచూసింది.