మెరిసిన జ్యోతి సురేఖ
22-05-2024 01:52 AM
యెచెయోన్ (దక్షిణ కొరియా): తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ స్టేజ్ ప్రపంచకప్‌లో సత్తా చాటింది. మంగళవారం జరిగిన ఆర్చరీ క్వాలిఫయింగ్ మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి 707 పాయింట్లు సాధించి నాలుగో స్థానం దక్కించుకుంది. భారత్‌కే చెందిన ప్రణీత్ కౌర్ (704 పాయింట్లు), అదితి స్వామిలు (702 పాయింట్లు) వరుసగా8వ, 15వ స్థానాల్లో నిలిచారు. దీంతో క్వాలిఫయింగ్ రౌండ్ అనంతరం మహిళల కాంపౌండ్ విభాగంలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. బై లభించే అవకాశముండడంతో భారత మహిళల జట్టు క్వార్టర్స్‌లో ఇటలీతో తలపడనుంది. ఇక పురుషుల కాంపౌండ్ విభాగంలో భారత ఆర్చర్లు నిరాశ పరిచారు. ప్రియాన్ష్ 16వ స్థానంలో నిలవగా.. ప్రథమేశ్, అభిషేక్ వర్మలు 20వ, 24వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.






