1 September, 2026 | 11:20 PM

Breaking News

వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్..   •   పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి   •   'అంబేద్కర్ అభయహస్తం' లబ్ధిదారులు ఎందరు?   •   రామచంద్ర రావు హౌస్ అరెస్ట్ అప్రజాస్వామికం   •   అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •  

సాత్విక్‌చిరాగ్ @ 1

22-05-2024 | 01:50am

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి బీడబ్యూఎఫ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఇటీవలే థాయ్‌లాండ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ జంట ఐదు వారాల తర్వాత తిరిగి నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించింది. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌కే పరిమితమైన సాత్విక్ జోడీ ఆ తర్వాత ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది. అయితే ఆదివారం జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్లో విజేతగా నిలిచిన ఈ జంట రెండు స్థానాలు ఎగబాకి 99670 పాయింట్లతో టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 9వ ర్యాంక్‌లో నిలిచాడు