300కే ఫైబర్ కనెక్షన్
93 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ ఇవ్వడమే లక్ష్యం
టీ--ఫైబర్‌కు 1779 కోట్లు రుణం ఇవ్వండి
- భారత్ నెట్-౩లో ఎన్‌ఓఎఫ్‌ఎన్ మొదటి దశ ఆర్కిటెక్చర్‌కు మార్చే డీపీఆర్‌ను ఆమోదించండి
- కేంద్రమంత్రి సింధియాకు సీఎం రేవంత్ వినతి
హైదరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): టీ--ఫైబర్ ప్రాజెక్టు అమలుకు తెలంగాణ ప్రభుత్వం రూ.1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన వ్యయం మొత్తాన్ని కేంద్ర యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌ఎఫ్‌వో) ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలని కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
దీని కోసం రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే రూ.530 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందని చెప్పారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల గృహాలకు మొత్తం 93 లక్షల ఇళ్లకు నెలకు రూ.300కే ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టకున్నట్టు వివరించారు. శుక్రవారం జ్యోతిరాధిత్య సింధియాను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో కలిశారు. టీతఫైబర్ ద్వారా రాష్ర్టంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశమని సీఎం స్పష్టంచేశారు.
రూ.౩౦౦కే ఫైబర్ కనెక్షన్
65,500 ప్రభుత్వ సంస్థలకు జీటూజీ (గవర్నమెంట్ టూ గవర్నమెంట్), జీటూసీ (గవర్నమెంట్ టూ సిటిజన్) కనెక్టివిటీ కల్పించడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 93లక్షల ఇళ్లకు నెలకు కేవలం రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ -ఎడ్యుకేషన్ సేవలు అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తున్నదని సీఎం రేవంత్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ర్టంలో 300 రైతు వేదికలకు టీ-ఫైబర్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తోందని చెప్పారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలకూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నా మని వివరించారు. జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ (ఎన్‌వోఎఫ్‌ఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ర్ట ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్ర మంత్రిని కోరారు.
ప్రస్తుతం రాష్ర్టంలోని కొన్ని జిల్లాల్లో ఎన్‌ఓఎఫ్‌ఎన్ మొదటి దశ లైనియర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నడుస్తుంటే.. మిగతా ప్రాంతాల్లో రింగ్ ఆర్కిటె క్చర్ ఆధారంగా టీ- నడుస్తోందని వివరించారు. ఎన్‌వోఎఫ్‌ఎన్ మొదటి దశను భారత్ నెట్ ఆర్కిటెక్చర్‌కు మార్చడానికి గతేడాది అక్టోబరులో కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం డీపీఆర్‌ను పంపించిందని, దానికి ఆమోదించాలని విజ్ఞప్తిచేశారు. భారత్ నెట్ ద్వారా రాష్ర్టంలోని 33 జిల్లాలపౌరులకు ఈ అందించగలుగుతామని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ- ఫైబర్‌కు వర్తింపజేయాలని సింధియాకు సీఎం విజ్ఞప్తి చేశారు.
స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆర్థిక సాయం చేయండి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మాండవీయకు సీఎం వినతి
తెలంగాణ యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు స్పోర్ట్స్ యూరివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి అవసరమైన ఆర్థిక సహాయం కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవీయకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడామౌలిక వసతుల అభివృద్ధికి ఖేల్ ఇండియా పథకం కింద నిధులు విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, సెంట్ర ల్ యూనివర్సిటీలోని షూటింగ్ రేంజ్, ఎల్బీ స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మౌలిక వసతులు, అభివృద్ధికి ఇప్పటికే పంపిచిన డీపీఆర్‌లను ఆమోదించాలన్నారు.
జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులన్నీ తెలంగాణలో ఉన్నాయని, భవిష్యత్‌లో నిర్వహించనున్న ఒలింపిక్స్‌తోపాటు ఇతర అంతర్జాతీయ, జాతీయ క్రీడలు నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం.. కేంద్ర మంత్రిని కలిశారు. క్రీడాశాఖకు సంబంధించి లక్ష్యాలను, ఆకాంక్షలను, తెలంగాణకు ఉన్న ఘనతను వివరించారు. అంతర్జాతీయ వేదికలపై క్రీడాకారులు రాణించడానికి అవసరమైన అన్ని వసతల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.
హైదరాబాద్‌లో గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీస్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, ఓయూ క్యాంపస్, జింఖానా గ్రౌండ్, హుస్సేన్‌సాగర్ తదితర అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన ఈత కొలనులు, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, సింథటిక్ అథ్లటిక్ ట్రాక్స్, వాటర్ స్పోర్ట్స్, ఇతర క్రీడలకు వసతులు ఉన్నాయని తెలిపారు. హైదరాబా ద్‌లో వివిధ క్యాటగిరీల ఫైవ్‌స్టార్ హోటళ్లు ఉన్నాయని, విమాన, రైలు సర్వీసులతో అనుసంధానమై ఉందని చెప్పారు. 2025 జనవరిలో నిర్వహించే ఖేల్ ఇండియా యూత్ గేమ్స్‌కు హైదరాబాద్‌కు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తిచేశారు.






