15 June, 2026 | 8:03 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల పాలనా విశిష్టత తెలిపేందుకే కాకతీయ కళల జాతర

11-05-2026 05:44 PM

హనుమకొండ,(విజయక్రాంతి): చేతన కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 13, 15, 17 తేదీలలో కాకతీయ కళల జాతర (ఓరుగల్లు మహా సాంస్కృతిక సమ్మేళనం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక సభ్యులు ఆకుల నాగేశ్వర్ తెలిపారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వర్ మాట్లాడుతూ వెయ్యి ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాకతీయ రాజుల పరిపాలన విశిష్టత, కళావైభవం, ధీరత్వం దాతృత్వం, అలాగే గొలుసుకట్టు చెరువుల నిర్మాణం, వంటి అంశాలు, భారతదేశంలోనే అత్యంత ప్రాచీన నగరమైన ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, పేరిణి, జానపదాలకు నిలయమైన, ఈ గడ్డమీద కాకతీయ కళల జాతర నిర్వహించడం, నేటి తరానికి ఈ కార్యక్రమం పరిచయం చేయడం కోసం చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజలంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమానికి మొదటి రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి, కూడ చైర్మన్ వెంకటరామిరెడ్డి, శాసనమండలి ఉపసభాపతి బండ ప్రకాష్, రెండవ రోజు కాకతీయ విశ్వవిద్యాలయంఆడిటోరియంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్,మాజీ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్, జనగామ శాసనసభ్యుడు పల్ల రాజేశ్వర్ రెడ్డి, మూడోరోజు వరంగల్ కోటలో కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖ, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తూర్పు మాజీ శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.