మేడిపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో కళావైభవ కార్యక్రమం
జిల్లా విద్యాధికారిణి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు
మేడిపల్లి,(విజయక్రాంతి): పీఎం శ్రీ జెడ్‌పిహెచ్‌ఎస్ మెడిపల్లి పాఠశాలలో ప్రజాపాలన- ప్రగతి పాలన. విద్యావారొత్సవాలు లో భాగంగా జిల్లా స్థాయి కళావైభవం కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సమిష్టిగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. శనివారం జిల్లాలోని అన్ని పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్రలేఖనం, నృత్యం, ఆర్ట్ మరియు క్రాఫ్ట్ పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి మరియు కళారూపాలను ప్రతిబింబించే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాధికారిణి ఐ. విజయ కుమారి పాల్గొని విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ వేణు, వివధ మండలాల ఎంఈఓ లు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






