calender_icon.png 23 July, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లుగీత కార్మిక సంఘం చండూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నిక

22-07-2025 05:47:59 PM

చండూరు (విజయక్రాంతి): తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం చండూరు మండల అధ్యక్షులుగా తాందారి యాదయ్య, మండల ప్రధాన కార్యదర్శిగా బొమ్మర గొని నరసింహ ఈనెల 20న చండూరు మండల కేంద్రంలో జరిగిన మండల మహాసభలో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. గీత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. బడా పెట్టుబడిదారులు తయారు చేస్తున్న లిక్కర్లు, కోకో కోలా లాంటి శీతల పానీయాల వల్ల కల్లు అమ్మకాలు పడిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే ఈ పానియాల వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానా నింపుకోవడానికి ప్రోత్సహిస్తున్నాయని ఆయన అన్నారు. కొంతమంది వ్యాపారులు కల్లు కల్తీ చేస్తున్నారనే నేపంతో కల్లు పైనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. వృత్తి చేసే వారందరికీ కాటమయ్య కిట్లు ఇవ్వాలని, పెండింగ్ ఎక్స్గ్రేషియా డబ్బులు వెంటనే విడుదల చేయాలని, నల్లగొండ జిల్లాలోనే నీరా, తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించాలని, నీరా కేఫ్ టెండర్ వేసి దాని ద్వారా ఆదాయం వచ్చే కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని వారన్నారు.