calender_icon.png 14 November, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లుగీత కార్మిక సంఘం నూతన కమిటీ

14-11-2025 12:00:00 AM

కన్నాయిగూడెం, నవంబరు13(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయ తీ కొత్తూరు గ్రామానికి చెందిన తాటి లచ్చ లు కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా కమిటీలోకీ ఆహ్వానించారు. కన్నాయిగూడెం మండలం నుండి ఒకరికి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తూ కల్లు గీత కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పనిచేస్తామని జిల్లా కమిటీ సభ్యులుగా నియమితులైన తాటి లచ్చులు గౌడ్ అన్నా రు.

ఈమెరకు ఈనెల 8న జరిగిన కల్లు గీత కార్మిక సంఘం జిల్లా మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా అధ్య క్షులు గుండెబోయిన రవిగౌడ్ అన్నారు. నా మీద నమ్మకంతో జిల్లా కమిటీలోకి తీసుకున్నందుకు జిల్లా గౌరవ అధ్యక్షులు పులి నర్సయ్య గౌడ్. జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రవిగౌడ్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ లకు మరియు జిల్లాలోని గీత కార్మికులకు అభినందనలు తెలిపారు.