14-11-2025 12:00:00 AM
పూణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయంలో పూజలు
కాళేశ్వరం, నవంబర్ 13 (విజయక్రాంతి): పవిత్ర కార్తీక మాసం ని పురస్కరించుకోని మహదేదపూర్ మండలం కాళేశ్వరం లోని ధక్షణా కాశీగా పెరొందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయం గురు వారం సందర్భరంగా భక్తులతో పోటెత్తింది. ఇతర రాష్ట్రలు, వివిధ జిల్లాల తో పాటు సమీప మహరాష్ట్రంలోని పలు ప్రంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరవడంతో త్రివేణి సంగమం పులకించింది.
ఈ సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయం కళకళ లాడింది. గోదావరి పుష్కర ఘాట్ పై భక్తులు పుణ్యస్నానలు చేశారు. గోదావరి నదిలో భక్తులు కార్తీక స్నానలు ఆచరించి గోదావరి మాతకు దీపాలు వదిలి, సైకత లింగాలను పూజించి పరవశించిపోయారు.