1 September, 2026 | 2:11 PM

నిత్య స్మరణీయుడు కాళోజీ

14-11-2024 12:42 AM

నివాళులర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని ప్రకటించిన ప్రజా కవి కాళోజీ నారాయణరావు నిత్య స్మరణీయుడని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. బుధవారం కాళోజీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి సీఎం పులమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ నేత రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు.