ఏడు రకాల సన్నాలు పండిస్తేనే బోనస్! ఎంతంటే?
సెప్టెంబర్ 10లోగా రైతులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి
గండీడ్/మహమ్మదాబాద్: (విజయక్రాంతి): ప్రభుత్వం గుర్తించిన ఏడు ప్రాధాన్య సన్న వరి రకాలను సాగు చేస్తున్న రైతులకు(Farmers) క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందించనున్నట్లు మండల వ్యవసాయ అధికారులు జి. రాధమ్మ, నరేందర్ తెలిపారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే రైతులు సెప్టెంబర్ 10లోగా తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం(Telangana Government) గుర్తించిన సన్న వరి రకాలను సాగు చేస్తున్న రైతులు సమీపంలోని గుర్తింపు పొందిన విత్తన డీలర్లను(Seed dealers) సంప్రదించి అవసరమైన వివరాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
రైతులు పట్టాదారు పాస్‌బుక్(Pattadar Passbook), ఆధార్ కార్డు, విత్తన కొనుగోలు రసీదు తదితర అవసరమైన పత్రాలను వెంట తీసుకెళ్లి సంబంధిత విత్తన డీలర్ వద్ద నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు(Agriculture Department officials) సూచించారు. అలాగే రైతులు సొంతంగా సన్న వరి విత్తనాలను ఉపయోగించి సాగు చేసినట్లయితే, సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ను సంప్రదించి ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవచ్చని రాధమ్మ తెలిపారు.
ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న వరి రకాలు
తెలంగాణ సోనా (RNR 15048)
సాంబ మసూరి (BPT 5204)
KNM 1688
HMT సోనా
జై శ్రీరామ్
WGL 44
KNM 7715






