కూసుమంచిలో కాంగ్రెస్ నేతలు ధర్నా..దిష్టి బొమ్మ దగ్ధం
BJP, RSS పై గళ మెత్తిన కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
(కూసుమంచి, విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని, అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కర్గే ఉత్తరాఖండ్ లోని ఓ దేవాలయంలో పూజలు చేసేందుకు వెళ్లగా... దళితులను దళిత నాయకులను అవమాన పరుస్తూ గుడిని కడిగించి, దళితులను అవమానపరిచే చర్యలను తీవ్రంగా ఖండిస్తూ కూసుమంచి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణచివేయడమేనని అన్నారు. ప్రజల తరఫున పోరాడుతున్న నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. అదేవిధంగా దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే ఏ చర్యనైనా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేసిందని వారు తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకట్ రెడ్డి, DCC జిల్లా ప్రధాన కార్యదర్శి MD హఫీజుద్దీన్ మరియు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు మండల నాయకులు యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు...






