17 April, 2026 | 9:28 PM

Breaking News

గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •   హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ   •  

ఏసీబీకి చిక్కిన కల్వకుర్తి ఎస్సై

26-06-2025 12:00 AM

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రాంచందర్

కల్వకుర్తి, జూన్ 25: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎస్సై రాం చందర్ స్టేషన్ బెయిల్ ఇవ్వ డం కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కాడు. గుండూర్ గ్రామానికి చెందిన నంబీ వెంకటయ్య పొలం వద్ద దాయాదుల మధ్య జరిగిన పంచాయితీలో కేసు నమోదైంది.

ఈ విషయంలో స్టేషన్ బెయిల్ కోసం ఎస్సై రాంచందర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని వెంకటయ్య ఏసీబీని ఆశ్రయిం చాడు. పథకం ప్రకారం బుధవారం రాత్రి ఏడు గంటలకు కల్వకుర్తి స్టేషన్‌లోనే రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.