7 August, 2026 | 9:03 PM

ఆషాడ పండుగలు... అమ్మవార్ల అనుగ్రహ వేదికలు

07-08-2026 08:17 PM

ఘనంగా జై శ్రీరామ్ నగర్ లో అమ్మవార్ల కళ్యాణ మహోత్సవ వేడుకలు

మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఆషాడ పండుగలు అమ్మవార్ల అనుగ్రహానికి వేదికలని మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని జై శ్రీరామ్ నగర్ కాలనీలో ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా శ్రీ కనకదుర్గ, శ్రీ రేణుక ఎల్లమ్మ, శ్రీ నల్ల పోచమ్మ తల్లుల కళ్యాణ మహోత్సవ వేడుకలు శుక్రవారం కనుల పండుగలా జరిగాయి.

ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి హాజరై అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మాట్లాడుతూ... ఆషాడ మాస పండుగలు అమ్మవార్ల అనుగ్రహానికి వేదికలని కనకదుర్గమ్మ తల్లి నల్ల పోచమ్మ తల్లుల దీవెనలు జవహర్ నగర్ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురిసి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తద్వారా తెలంగాణ ఆకుపచ్చని తెలంగాణగా వర్ధిల్లాలని కోరుతున్నారు. అనంతరం అమ్మవార్ల తీర్థప్రసాదాలు స్వీకరించారు .ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, బిఆర్ఎస్ అధ్యక్షుడు కొండల ముదిరాజ్, కాలనీవాసులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.