26 August, 2026 | 9:08 PM

మాచిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

26-08-2026 08:24 PM

సదాశివపేట: సదాశివపేట మండలంలోని మాచిరెడ్డిపల్లి గ్రామంలో కుమ్మరి సక్కమ్మకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తూర్పు నిర్మల జగ్గారెడ్డి, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ మోహన్‌గౌడ్ చేతుల మీదుగా గృహప్రవేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మోహన్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతోందన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని సక్కమ్మ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.