16-07-2025 06:16:02 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ బి వాలియా పదోన్నతిపై వచ్చారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో ప్రొఫెసర్ ఆర్థోపెడిక్ గా పనిచేసి ప్రమోషన్పై కామారెడ్డి జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా పదోన్నతిపై వచ్చారు. బుధవారం మర్యాదపూర్వకంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను కలెక్టరేట్లో కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా వాలియా మాట్లాడుతూ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.