calender_icon.png 17 July, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వాణికేతన్ డిగ్రీ, పీజీ బ్రయో2కె25 వేడుక

16-07-2025 06:21:06 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): ఆర్థిక స్వాతంత్రంతోనే భవిష్యత్తులో ఉన్నతశిఖరాలు అధిరోహించాలని వాణినికేతన్ విధ్యాసమితి సెక్రటరీ, కరస్పాండెంట్ ఇలినాని దీపిక విధ్యార్థులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం కరీంనగర్ లోని కెమిస్ట్ భవన్ లో వాణినికేతన్ డిగ్రీ, పీజీ విద్యార్థులు బ్రయో2కె25 పేరిట వేడుకను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన కరస్పాండెంట్ ఇలినాని దీపికతో పాటు కళాశాల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు సరస్వతీ మాతకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఇలినాని దీపిక మాట్లాడుతూ వాణినికేతన్ విద్యాసంస్థలు రాష్ట్రస్థాయిలో విశిష్టమైన గుర్తింపు సాధించాయన్నారు. ఇక్కడ చదువుకున్న ప్రతి విధ్యార్థి ఉద్యోగం పొందడమే కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆశించారు.  వాణినికేతన్ డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి, వాణినికేతన్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.ప్రశాంత్ రావు, డైరెక్టర్ డాక్టర్ డి.వెంకట్ రావు, వైస్ ప్రిన్సిపాల్ మోహన్ ప్రసాద్ లు విధ్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.