07-12-2025 04:05:47 PM
కందనెల్లి తాండ సర్పంచ్ అభ్యర్థి శాంత దేవి
తాండూరు,(విజయక్రాంతి): బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే కందనెల్లి తండాను నియోజకవర్గంలో ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చి దిద్దుతానని వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శాంతాదేవి అన్నారు. ఆదివారం ఆమె జాగో బంజారా సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు సురేందర్ నాయక్ మహారాజ్, గ్రామ యువకులు, మహిళలతో కలిసి ఇంటిఇంటి ప్రచారం నిర్వహించారు.
బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆమె ఓటర్లతో కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తండాలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ కనీస మౌలిక సదుపాయాలు అయిన త్రాగునీరు, వీధి దీపాలు, మురుగు కాలువల నిర్వహణ మరియు విద్య వ్యవస్థ అభివృద్ధి ,, యువతకు ఉపాధి కల్పించేందుకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలు ఆదరించి బ్యాట్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరారు.