07-12-2025 04:01:19 PM
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య
తుంగతుర్తి,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో తుంగతుర్తి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సోలిపురం. అశ్విని కన్నా రెడ్డి తో కలిసి ఇంటింటి ప్రచారంలో, పాల్గొని మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే గ్రామాలు అన్నీ విధాలుగా అభివృద్ధి చెందుతాయన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
పేదలకు రేషన్ కార్డులు ఇండ్లు ఇవ్వలేదని మహిళలకు నాసిరకం చీరలు ఇచ్చి వారి మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నాణ్యమైన చీరలు అందజేస్తుందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కోట్ల రూపాయలతో గ్రామాల్లో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే వెనకబడిన ఈ ప్రాంత గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణ, సురేష్ రెడ్డి, నవీన్ చారి, కార్యకర్తలు పాల్గొన్నారు.