calender_icon.png 8 December, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈశ్వర చారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

07-12-2025 04:18:45 PM

హనుమకొండ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 5 నాడు ఈశ్వర చారి మరణిస్తే ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం బలహీన వర్గాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుంది.

కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చారి మరణంతో అనాధలైన ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎక్స్ గ్రేషియాతో పాటు భార్యకి ఉపాధి, పిల్లలకి విద్యను అందించే విధంగా  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాలు ముఖ్యంగా యువత సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలి కానీ క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలు లాంటి విపత్కర చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. బీసీ సంఘాలు, కుల సంఘాలు ఈశ్వర చారి కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.