2 May, 2026 | 6:54 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

విద్యార్థుల కృషి అభినందనీయం

02-05-2026 05:35 PM

కన్నాల సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని కన్నాల హైస్కూల్ లో 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత  సాధించడం పట్ల గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య ఉపాధ్యాయులను  అభినందించారు. గత రెండు సంవత్సరాల నుండి 100 శాతం ఉత్త్తీర్ణత సాధిస్తున్నందుకు పాఠశాల ఉపాధ్యాయుల కృషి వల్లే సాధ్యమైయిందని అన్నారు. ఈ సంవత్సరం మంథని మండలం లో జిల్లా పరిషత్ పాఠశాల లో రెండవ టాపర్ గా నిలిచి 545 మార్కులు సాధించి కన్నాల జడ్పీహెచ్ఎస్ మొదటి స్థానం లో నిలిచిన తస్మిరాను తల్లి, తండ్రి సమక్షంలో శాలువా తో ఘనంగా సన్మానించారు. అలాగే శ్రీవన్, రాంచరణ్, అభిరుద్, వర్షిత్, అంజలి, అలీషా   తదితరులు రూ. 500 లకు పైన మార్కులు సాధించడం పట్ల వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు కానుగంటి శ్రీనివాస్, వార్డ్ మెంబెర్ కీర్తన, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు.