పెద్దమ్మ తల్లి ఆలయానికి సీసీ కెమెరాలు వితరణ
రూరల్ సీఐ స్థానిక ఎస్సై చేతుల మీదుగా ప్రారంభం
ఇల్లంతకుంట,(విజయక్రాంతి): మండలంలోని రహీమ్ ఖాన్ పేట గ్రామానికి చెందిన ఎర్ర నర్సుపల్లె పెద్దమ్మ గుడి ఆలయానికి ఉప సర్పంచ్ గడ్డమీద పద్మ సుమారు 25వేల రూపాయల సీసీ కెమెరాల సామాగ్రిని ముదిరాజ్ సంఘం సభ్యులకు వితరణ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ముదిరాజు సంఘ సభ్యులు ఉప సర్పంచ్ పద్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, తధానానంతరం ఉప సర్పంచ్ పద్మ ఆహ్వానం మేరకు రూలర్ సీఐ నాగేశ్వరరావు మరియు స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ పెద్దమ్మతల్లి ఆలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు, ఈ సందర్భంగా రూలర్ సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలోని యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా బాగా చదివి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని, తల్లితండ్రులు కూడా పిల్లల్ని పర్యవేక్షించాలని తెలిపాడు, ఎస్సై అశోక్ మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర చాలా కీలకమని తెలిపాడు.






