15 April, 2026 | 4:12 AM

నేటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశిష్టత సప్తాహ ప్రవచనం

29-10-2025 05:47 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని పాతవాడలో గల శివాలయంలో గురువారం నుండి వచ్చే నెల 5 వరకు కార్తీకమాసమును పురస్కరించుకొని కార్తీకమాస విశిష్టత సప్తహ ప్రవచనం, పౌర్ణమి రోజు ఐదు తారీకు దీపోత్సవ కార్యక్రమం ఉంటుందని శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, అర్చకులు వల్లకొండ మఠం మహేష్, తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్ పెద్దపల్లి జిల్లా ధర్మాచార్యులు మెంగని చంద్రశేఖర్ లు బుధవారం తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజల్లోపల భక్తి భావం పెంపొందించుటకై తిరుమల తిరుపతి దేవస్థానం వారు మన శివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ  కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు  కొనసాగుతుందని రామ్మోహన్ రావు వారిచే కార్తీక మాస విశిష్టతను తెలియజేసే ప్రవచన కార్యక్రమం కొనసాగుతుందని, అలాగే పౌర్ణమి రోజు దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది కావున భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షములు  సుల్తానాబాద్ శివుడి కృపాకటాక్షములు పొందాలని అన్నారు.