30 July, 2026 | 1:30 AM

భద్రాచలంలో కాసం ఫ్యాషన్స్ ఎగ్జిబిషన్

30-07-2026 12:43 AM

ప్రారంభించిన సినీ నటి, యాంకర్ రష్మి

హైదరాబాద్, జూలై 29(విజయక్రాంతి): నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ ప్రజల ఆదరణను పొందిన కాసం ఫ్యాషన్స్ మాల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 29 శాఖలతో విస్తరించింది. ఈ క్రమంలో భ ద్రాచలంలో కాసం ఫ్యాషన్స్‌ఎగ్జిబిషన్ ఘ నంగా ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటి యాంకర్ రష్మీ గౌతమ్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రష్మి మా ట్లాడుతూ భద్రాచలం ప్రజలు కాసం ఫ్యాష న్స్ ఎగ్జిబిషన్ మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉంది అన్నారు.

కాసం ఫ్యాషన్స్ మాల్ డైరెక్టర్లు కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లా డుతూ ‘ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అ నువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే మా విజయ రహస్యమని తెలిపారు.

కాసం ఫ్యాషన్స్ షాపింగ్ మాల్‌లో మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం తాజా ఫ్యాషన్ కలెక్షన్స్, అలాగే వివాహాలు, శుభకార్యాలకు ప్రత్యేకమైన భా రీ వెడ్డింగ్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నా యి. ఈ ఎగ్జిబిషన్‌తో ప్రజలు ఇకపై పెళ్లి షా పింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.ప్రజలు తమ తమ శుభ కార్యక్రమం ఏది ఉన్న ఒకసారి కాసం ఫ్యాషన్స్ షాపింగ్ మాల్ కు సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఒక నూతన షాపింగ్ ఒరవడి సృష్టించాలని డైరెక్టర్స్ కోరారు.