13 June, 2026 | 8:02 PM

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా కత్తుల లింగస్వామి

13-06-2026 06:29 PM

చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన  కత్తుల లింగస్వామి ఎన్నికయ్యాడు. తిప్పర్తి మండలంలోని దుప్పలపల్లి లో జరిగిన ఆ సంఘం జిల్లా 20వ మహాసభలలో ఆయనను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న మిగులు భూములను, పోడు భూములను గుర్తించి భూ పోరాటాలను ఉదృతం చేస్తామని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికులకు దినసరి కూలీ 800 రూపాయలు పెంచే వరకు పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడానికి బలమైన ఉద్యమాలను జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని తెలిపారు.