డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
కరీంనగర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపు కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఆగారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి జిల్లాలోని తాజా పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు.
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆర్డీవో షర్మిలతో, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






