17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మాల్దీవుల అంబాసిడర్‌గా కత్రినా!

11-06-2025 12:00 AM

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. పర్యాటకులను ఆకర్షించేందుకు విజిట్ మాల్దీవ్స్ పేరుతో ప్రత్యేక వేసవి విక్రయ ప్రచారాన్ని తాజాగా ప్రారంభించింది. ఇందులోభాగంగానే కత్రినా కైఫ్‌ను రాయబారిగా ఎంపిక చేసినట్టు తెలిపింది.

ఈ నియామకంపై కత్రినా ఆనందం వ్యక్తం చేశారు. మాల్దీవుల అందానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. “మాల్దీవులు సహజ సౌందర్యాన్ని సూచిస్తారు. ప్రశాంతంగా ఉండే ప్రదేశం. పర్యాటకులను పెంచేందుకు నావంతు కృషి చేస్తాను. దీనికి అంబాసిడర్‌గా నియమించడం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు. నిరుడు భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు పర్యాటకం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

మాల్దీవుల పర్యాటకుల విషయంలో 2023లో అగ్రస్థానంలో ఉన్న భారత్.. 2024 నాటికి ఆరో స్థానానికి చేరింది. దీంతో భారతీయులను ఆకర్షించేందుకు ఆ దేశం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే కత్రినాను రాయబారిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఆ దేశాన్ని సందర్శించనున్నారు.