calender_icon.png 14 June, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొమాంటిక్ బర్బాద్

11-06-2025 12:00:00 AM

యష్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ లవ్‌స్టోరీ ‘సయారా’. ఈ చిత్రంతో అహాన్ పాండే వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో అనీత్ పద్దా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్, టైటిల్ సాంగ్ ఆకట్టుకుంది. తాజా ఈ చిత్రం నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ‘బర్బాద్’ అంటూ సాగే ఈ పాటను జుబిన్ ఆలపించగా, ది రిష్ గీత సాహిత్యాన్ని అందిస్తూ బాణీ సమకూర్చారు.

ఈ పాట గురించి దర్శకుడు మాట్లాడుతూ.. “ప్రేమ పాటల్ని పాడటానికి ప్రతి తరంలో ఓ గాయకుడు పుట్టుకొస్తారు. ఈ తరానికి జుబిన్ అలాంటి ఓ గ్రేట్ సింగర్. సయారా ఆల్బమ్‌లో జుబిన్ ఫీల్ గుడ్ రొమాంటిక్ ట్రాక్ పాడారు” అన్నారు. అక్షయ్ విధాని నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 18న విడుదల కానుంది.