2 May, 2026 | 12:25 PM

రాజకీయాల్లో స్పేస్ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందే

20-09-2025 12:22 PM

కాంగ్రెస్ లోకి వెళ్లాలన్న ఆలోచన నాకు లేదు

కాంగ్రెస్ పెద్దలు నన్ను సంప్రదించలేదు

సీఎం ఎందుకలా అంటున్నారో తెలియదు.. భయపడుతున్నారేమో

హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీలోకి(Congress Party) వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు(Telangana Jagruthi President) కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదని కవిత స్పష్టం చేశారు. సీఎం ఎందుకలా అంటున్నారో తెలియదు.. భయపడుతున్నారేమో? అన్నారు. కాళేశ్వరం అంశంలో తప్ప హరీశ్ రావుపై తనకు వేరే కోపం లేదని సూచించారు. ఇరిగేషన్ పై 2016లోనే కేటీఆర్ కు సూచించానని కవిత వివరించారు. నేరుగా సీఎంకే ఫైళ్లు వెళ్తున్నాయని కేటీఆర్ కు చెప్పానని కవిత వెల్లడించారు. కిందిస్థాయి కమిటీ పరిశీలన, ఆమోదం లేకుండానే సీఎంకు ఫైళ్లు వెళ్లాయని తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్నీ అర్థమవుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించలేదని చెప్పిన కవిత రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందేన్నారు.